Saturday, 14 June 2025 09:49:33 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కొవిడ్​ రూల్స్​ పాటించలేకపోతే యాత్రను ఆపేయండి.. రాహుల్​ కు కేంద్రం లేఖ

Date : 21 December 2022 11:19 AM Views : 345

జై భీమ్ టీవీ - జాతియం / : భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ లకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​ లో కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కు కూడా పంపింది. జపాన్​, అమెరికా, చైనా, బ్రెజిల్​, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో మంగళవారం రోజున అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కొవిడ్​ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రికి అధిర్​ కౌంటర్​ రాహుల్​ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. ‘‘బహుశా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలాంటి లేఖను విడుదల చేశారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు”అని వ్యాఖ్యానించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :