Friday, 18 July 2025 07:13:58 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

నేడు కవిత విచారణ

Date : 11 March 2023 09:12 AM Views : 361

జై భీమ్ టీవీ - జాతియం / : లిక్కర్ స్కామ్ లో ప్రశ్నించనున్న ఈడీ సిసోడియా, పిళ్లైతో కలిపి విచారించే చాన్స్ ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లిక్కర్ స్కామ్​లో సిసోడియా, పిళ్లైతో కలిపి విచారించే చాన్స్ ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో శుక్రవారం ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10:30 గంటల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్‌‌‌‌కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైమ్ ఇవ్వాలని కవిత కోరగా, ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి, బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో శనివారం కవిత విచారణకు హాజరుకానున్నారు. కాగా, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే చాన్స్​ ఉండడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లే రూట్​లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లీగల్ టీమ్​తో కవిత భేటీ... కవితను ఈడీ విచారించనున్నందున మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ​విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేటీఆర్ మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి రాగా.. తర్వాత హరీశ్​రావు కూడా వచ్చారు. కేసీఆర్ ​ఆదేశాల మేరకే వారు ఢిల్లీకి వచ్చినట్టు తెలిసింది. కవిత అరెస్టు తప్పదనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, లీగల్ టీమ్ కూడా ఢిల్లీకి చేరుకుంది. మహిళా రిజర్వేషన్లపై దీక్ష ముగిసిన తర్వాత ఆ టీమ్​తో కవిత భేటీ అయి, ఆమెకు న్యాయ సలహాలు ఇచ్చినట్టు సమాచారం. బలవంతంగా తన వాంగ్మూలాన్ని తీసుకున్నారన్న అరుణ్ పిళ్లై పిటిషన్​పై కూడా చర్చించినట్లు తెలిసింది. కాగా, ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు. ఢిల్లీలోనే మహిళా కార్యకర్తలు... మహిళా రిజర్వేషన్ల కోసం శుక్రవారం కవిత చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు ఢిల్లీలోనే ఉండిపోయారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. దీక్ష తర్వాత చాలామంది తిరిగి వెళ్లిపోవాల్సి ఉన్నా.. కవిత విచారణ నేపథ్యంలో వీరంతా ఆగిపోయారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ స్టేట్​మెంట్లే కీలకం.. సౌత్ గ్రూప్​లో కవిత కోసమే పని చేశామని అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్లే కవిత విచారణలో కీలకం కానున్నాయి. ఫోన్ల ధ్వంసం, ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్స్, ఆప్ కు హవాలా రూపంలో డబ్బు తరలింపు తదితర అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది. కవితను ముందు విడిగా, ఆ తర్వాత జాయింట్ సెషన్ లో విచారిస్తారని సమాచారం. కవిత అనుచరుడు పిళ్లై ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కవిత విచారణలో మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై కూడా ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ విచారణ ఒక్క రోజుతోనే ముగిసే పరిస్థితి లేదని, ఆదివారం కూడా కవితను పిలిచే ఆవకాశం ఉందని తెలిసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :