Sunday, 07 December 2025 09:44:59 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఉగ్రదాడిలో అమరులైన జవన్ల పేర్లు విడుదల

Date : 21 April 2023 11:36 AM Views : 375

జై భీమ్ టీవీ - జాతియం / : శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu&Kashmir)లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో అమరులైన వీర జవాన్ల పేర్లను ఆర్మీ అధికారులు ప్రకటించారు. హవల్దార్ మందీప్ సింగ్, లాన్స్ నాయక్, దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవత్ సింగ్‌లు అమర సైనికులని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా, ఒకరు ఒడిస్సాకు చెందినవారని అధికారులు తెలిపారు. అటు ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది. జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నిన్న భీంబేర్‌గలీ నుంచి షాంగీ రోడ్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వాహనం ఇంజన్‌ను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్స్ విసిరారు. దీంతో ఆర్మీ వాహనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. జవాన్లు ఎదురుదాడి చేసే వీలు లేకుండా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తోటి జవాన్లకు ఆహారం తీసుకువెళుతున్న ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కశ్మీర్‌లో పూంచ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కోరింది. కాగా జవాన్లపై దాడికి తమదే బాధ్యత అని పీఏఎఫ్ఎఫ్‌ ప్రకటించింది. సరిగ్గా.. 2021లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2019లో అల్‌ ఖాయిదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీఏఎఫ్ఎఫ్‌ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :