Sunday, 14 December 2025 03:50:24 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ .. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

Date : 01 May 2023 12:47 PM Views : 408

జై భీమ్ టీవీ - జాతియం / : మే10న జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను బెంగుళూరులో రిలీజ్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో 16 ముఖ్యమైన హామీలను బీజేపీ పొందుపరిచింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించింది. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని బీజేపీ తెలిపింది. మైసూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో 'అటల్ ఆహార కేంద్రాన్ని' ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 3,632 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీ నుంచి 707 మంది, కాంగ్రెస్ నుంచి 651 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 1,720 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :