జై భీమ్ టీవీ - జాతియం / : కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. వివిధ రాష్ర్టాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు, ముగ్గురు విపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. చాలామంది గతంలో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ.. మంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. సైడ్ లైట్స్ * కేబినెట్ లో దళిత సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం * వేదికపై అందరూ సిద్ధరామయ్యకు అభివాదం తెలిపారు. * తమ తండ్రి ప్రమాణస్వీకారం సందర్భంగా వేదికపై సిద్ధరామయ్య కుమారుడు సందడి చేశాడు. * ప్రమాణస్వీకారానికి చేసే ముందు డీకే అందరికీ అభివాదం చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మిత్రపక్షాల వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. ఈ సందర్భంగా వారంతా డీకేకు శుభాకాంక్షలు తెలిపారు.
Admin