Friday, 18 July 2025 05:41:28 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఉద్యోగ భద్రతతోనే ఉత్పాదక శక్తి పెరిగేది

*ప్రపంచ యువతలో అభద్రతతోనే ఉద్యోగం చేస్తున్నది సగం మంది *మీడియా, ఇన్ఫర్మేషన్‌, ఆతిథ్యం, వినోద రంగాల్లో అభద్రత అధికం *ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతోందని, ఇటీవలే ఓ సర్వే నివేదిక వెల్లడించింది. ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్వే నివేదిక వెల్లడించింది. ఈ స్థితిలో ఉద్యోగ భద్రతతోనే ఉత్పాదక శక్తి పెరిగేదని గ్రహించాలి

Date : 17 July 2023 04:27 PM Views : 356

జై భీమ్ టీవీ - జాతియం / : విశ్లేషణ : మోడాల చంద్రశేఖర్ సీనియర్ పాత్రికేయులు, ధ్యాన, సైన్స్ వ్యక్తిత్వ వికాస నిపుణులు 9440210283 ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టట్యూట్ 32,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల సేకరించారు. దాని ఆధారంగా నివేదిక రూపొందించారు. భారత్‌లో దాదాపు సగం (47 శాతం) మంది ఉద్యోగుల్లో తమ కొలువు పట్ల అభద్రత నెలకొంది. భారత్‌లో 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే జనరేషన్‌ జెడ్‌లో రెట్టింపు మందిలో అభద్రత నెలకొంది. ఆర్థిక ఒడుదుడుకులు, అనిశ్చిత సమయంలో, ముఖ్యంగా బహుళ జాతి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయన్న కథనాలతోపాటు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జనరేషన్ జడ్ (18-24 వయసు గల వారు)లో సగం మంది ఉద్యోగ అభద్రతతో బాధపడుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, ఇన్ఫర్మేషన్‌ రంగాల్లో ఈ పరిస్థితి అధికంగా నెలకొంది. ఆ తరువాత స్థానాల్లో ఆతిథ్యం, వినోద రంగాలున్నాయి. భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణం, సంబంధిత రంగాల కార్మికుల్లో ఉద్యోగ అభద్రత అధిక స్థాయిలో ఉంది. అన్ని మార్కెట్లలోనూ యువతలోనే ఉద్యోగ అభద్రత అధికం. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే జనరేషన్‌ జెడ్‌లో రెట్టింపు మందిలో అభద్రత నెలకొంది. 60 శాతం మంది ఉద్యోగాన్ని సుస్థిరం చేసుకునేందుకు అధిక పని గంటలు పని చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనరేషన్‌ జెడ్‌లోని ప్రతి ఐదు మందిలో ఒకరు గడిచిన ఏడాదికాలంలో వేరే రంగానికి మారాలనుకున్నారు. సొంత వ్యాపారం ప్రారంభించాలని 25 శాతం మంది భావించారు. 55 ఏళ్లు పైబడినవారిలో 17 శాతం మంది త్వరగా రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :