Friday, 18 July 2025 06:30:41 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ISRO Recruitment 2023: ఇస్రోలో 435 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేదు..

Date : 05 October 2023 10:00 PM Views : 273

జై భీమ్ టీవీ - జాతియం / : కేరళలోని తిరువనంతపురంలోనున్న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద 435 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 273, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు162 వరకు.. ISRO Recruitment 2023: ఇస్రోలో 435 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేదు.. కేరళలోని తిరువనంతపురంలోనున్న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద 435 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 273, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు162 వరకు ఉన్నాయి. ఏరోనాటికల్/ఏరోస్పేస్, కెమికల్‌, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలార్జీ, ప్రొడక్షన్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి కలిగిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీఏ/ బ్చాచిలర్ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా నేరుగా కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ, పరీక్షలో మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ జరిగే తేదీ అక్టోబర్‌ 7, 2023. ఈ రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సంబంధిత డాక్యుమెంట్లతో అభ్యర్ధులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి 12 నెలలపాటు అప్రెంటిస్‌ శిక్షణ ఇస్తారు. నెలకు రూ.8 వేలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :