Sunday, 14 December 2025 04:39:25 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

విభజన సమస్యలపై 23న కేంద్రం కీలక సమావేశం

Date : 08 November 2022 04:42 PM Views : 535

జై భీమ్ టీవీ - జాతియం / : విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న సమావేశం జరగనుంది. దీనిపై ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రం సమాచారాన్ని అందజేసింది. 23వ తేదీన జరిగే సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈసారి జరిగే భేటీలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, లోటు భర్తీ, అమరావతికి నిధులు తదితర అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చినట్లు సమాచారం.కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదని రైల్వేశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. సెప్టెంబరు 27న జరిగిన సమావేశంలో..చివరగా సెప్టెంబరు 27న జరిగిన సమావేశ ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉండగా, ఏడింటిపై చర్చించారు. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై చర్చ జరిగింది. సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, AP SCSCL, TSSL క్యాష్ క్రెడిట్, 2014- 15 రైస్ సబ్సిడీ విడుదల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు దాదాపు 26 సమావేశాలు జరిగాయి

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :