జై భీమ్ టీవీ - జాతియం / : ఔలిలో ఉన్న పర్వతాల ఎత్తు దాదాపు 20 వేల అడుగులు. ఇక్కడికి చేరుకోవాలంటే జోషిమఠంకు ముందుగా చేరుకోవాలి. జోషిమఠం నుండి ఔలి చేరుకోవడానికి మూడు దారులున్నాయి. మొదటి రోప్‌వే- ఈ మార్గంలో సాహసం చేస్తూ ప్రయాణం చేయాలనుకునేవారు ఈ రోప్ వే ద్వారా ఔలి చేరుకుంటారు. రోప్‌వేలో ఒక వ్యక్తికి రూ. 1,000 ఛార్జ్ చేస్తారు. ఔలికి రహదారి ద్వారా కూడా వెళ్ళవచ్చు, దీని దూరం 16 కిలోమీటర్లు. మూడవ మార్గం కాలినడకన చేరుకోవచ్చు. మంచు దుప్పటి కప్పుకుని శ్వేతవర్ణంతో మిలమిలా మెరిసే మంచును చూడటం.. మంచులో ప్రయాణం చేయడం మీకు ఇష్టమా.. అయితే మనదేశంలోని ఔలిని సందర్శించడానికి ప్లాన్ చేసుకోండి. మంచులో ఎంజాయ్ చెయ్యాలనే మీ కలలన్నీ ఔలిలో నెరవేరుతాయి. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందంటే.. ఔలీని ఉత్తరాఖండ్ స్విట్జర్లాండ్ అంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి ఔలి. భారతదేశంలోని అత్యుత్తమ స్కీయింగ్ ప్రదేశాల్లో ఔలీ కూడా పరిగణించబడుతుంది. ఔలి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దీని ఎత్తు సుమారు 3 వేల మీటర్లు. పచ్చటి మైదానాలతో కూడిన ఔలి శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఔలిలోని పర్వతాల అద్భుతమైన వీక్షణను చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇక్కడ అనేక రకాల సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
Admin