జై భీమ్ టీవీ - జాతియం / : పసిడి ప్రియులకు నిజంగానే ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.. ఎందుకంటే..మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. రెండు మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం దసరా నేపథ్యంలో మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో బంగారం ధరలు షాకిస్తున్నాయి. అయితే, ఇవాళ గోల్డ్ రేట్ స్వల్ప ఊరట కల్పించింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,541 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,045. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు వివరాలు.. ☛ హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది. వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం..! ‘మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. ☛ వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది. ☛ ఏపీలోని విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,450 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,410 ఉంది. ☛ విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,410 పలుకుతోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్స్ ఇలా.. దేశ రాజధాని ఢిల్లీ: ☛ 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,560 ☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గొల్డ్ ధర రూ. 60,600గా ఉంది. బెంగళూరు: ☛ 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,410 ☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,450 ముంబై: ☛ 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,560 ☛ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,610 కోల్‌కతా: ☛ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,410 ☛ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450. చెన్నై: ☛ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,560. ☛ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,610గా ఉంది. పూణె: ☛ 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,410 ☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450 దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.. పుత్తడి పరుగులు పెడుతుంటే.. వెండి స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్నిచోట్ల మినహా దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 74,100, ముంబైలో రూ. 74,100, బెంగళూరులో రూ. 73,000, కోల్‌కతా రూ. 74,100, చెన్నైలో రూ. 77,000 గా ఉంది.
Admin