Sunday, 09 November 2025 01:24:53 PM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

భక్తి పారవశ్యంలో కత్తితో నాలుకను తెగ నరికి దేవతకు అర్పణ.. వీడియో తీసేందుకు ఎగబడ్డ భక్తులు

Date : 17 October 2023 11:38 AM Views : 327

జై భీమ్ టీవీ - జాతియం / : మూఢభక్తి ముసుగులో ఓ యువతి దారుణానికి పాల్పడింది. దేవలను పూజించేందుకు గుడికి వెళ్లిన ఓ యువతి తన్మయత్వంలో పదునైన కత్తితో నాలుకను తెగనరికి దేవతకు అర్పించింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని బాగేశ్వరి శక్తి ధామ్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటన సమయంలో ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని సాగూర్ భాగూర్‌లో మాతా బాగేశ్వరి శక్తి ధామ్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన, చారిత్రాత్మక దేవాలయం. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల మొదటి రోజు అమృత్ కుండ్‌కు చెందిన ఓ యువతి నాలుకను కత్తితో కోసి దేవతకు సమర్పించింది. యువతి కత్తి పట్టిన వెంటనే అక్కడున్న జనం అంతా మరింత బిగ్గరగా, ఉత్సాహంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఆమె అమాంతం కత్తితో నాలుకను తెగ నరికి దేవతకు సమర్పించింది. కత్తి దాటికి యువతి నోటి నుంచి రక్తపు ధారాపాతంగా కారిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం యువతి సృహతప్పి పడిపోయింది. అయినప్పటికీ అక్కడ ఉన్న భక్తుల్లో ఏక్కరూ కూడా ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదు. బదులుగా ఈ సంఘటన తర్వాత ఆలయ ప్రాంగణంలోని భక్తులంగా పెద్ద ఎత్తున అమ్మవారి స్తుతులతో ప్రతిధ్వనిస్తుంది. ఈ యువతిని దేవత పూనిందని అక్కడున్న వారంతా చెప్పుకొవడం విశేషం. దీంతో ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో బంధించడానికి వందలాది మంది ప్రజలు పోటెత్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :