Friday, 18 July 2025 07:09:53 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

లంచం ఇస్తేనే ఉద్యోగం.. 16 మంది ఉద్యోగులను తొలగించిన టాటా కన్సల్టెన్సీ

Date : 17 October 2023 11:40 AM Views : 260

జై భీమ్ టీవీ - జాతియం / : దేశంలో దిగ్గజ టెక్ కంపెనీ, టాటా గ్రూప్ సంస్థ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను షేక్ చేసిన బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలో ప్రతి ఏటా సగటున 50 వేల మంది కొత్తగా ఉద్యోగాలు పొందుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 46 దేశాలకుపైగా 150కిపైగా ప్రాంతాల్లో సేవలందిస్తోంది. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ కంపెనీలో లంచం ఇస్తేనే ఉద్యోగం అంటూ జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు తేలిన 16 మంది ఉద్యోగులను తొలగించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అలాగే 6 నియామక సంస్థలను డిబార్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15న ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది టీసీఎస్. కంపెనీలో ఉద్యోగుల నియామకంలో చూసిచూడనట్లు వ్యవహరించేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు నియామక సంస్థలు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై టీసీఎస్ దర్యాప్తు చేపట్టింది. కొన్ని నెలల తర్వాత ఈ దర్యాప్తు ముగింపు దశకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న 19 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. అందులో 16 మందిని ఉద్యోగంలోంచి తొలగించగా.. ముగ్గురిని నియామకాలకు సంబంధించిన విధుల నుంచి మార్చింది. అయితే కంపెనీలో ఎలాంటి మోసం జరగలేదని, సంస్థపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని TCS పేర్కొంది. అలాగే కీలకమైన మేనేజ్‌మెంట్ వ్యక్తి ప్రమేయం ఇందులో లేదని తేల్చేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :