Sunday, 07 December 2025 09:47:54 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌ రైలు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

Date : 20 October 2023 09:03 AM Views : 374

జై భీమ్ టీవీ - జాతియం / : వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అలాగే, త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్, మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ కోచ్, వందే భారత్ మెట్రోలను త్వరలో ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. జమ్ము-శ్రీనగర్‌ రైల్వే లైను పనులు వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీనగర్‌ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రైల్వేలైను విద్యుదీకరణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ కూడా వందే భారత్ రైలు దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం 75 రైళ్లను పట్టాలు ఎక్కించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. అలాగే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా సుదూర ప్రాంతాలకు వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. జమ్ము నుంచి శ్రీనగర్‌ వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తి కాగానే వందేభారత్ రైళ్లు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. అతి త్వరలోనే వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కిస్తామన్నారు. నూతన రైళ్లను సాంకేతిక నిపుణులు స్పెషల్ డిజైన్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు.. ఎత్తయిన, వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ము కశ్మీర్‌లో రైల్వే లైన్ల అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఆసక్తి చూపిస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్, మెట్రో రైలును.. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ మాట్లాడుతూ, ప్రతిదీ సరిగ్గా జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నమూనా (వందే భారత్ స్లీపర్ రైలు)తో ప్రపంచ స్థాయి సాటిలేని ప్రయాణ అనుభూతిని అందిస్తాము. BEML మొదటి స్లీపర్ వందే భారత్ రైలును అభివృద్ధి చేయడానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై మరియు రైల్వే బోర్డుతో కలిసి పనిచేస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :