Sunday, 14 December 2025 02:51:30 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందో చూడండి.!

Date : 21 October 2023 08:52 AM Views : 337

జై భీమ్ టీవీ - జాతియం / : గుర్తుతెలియని వ్యక్తి నడుపుతున్న కారు పైకప్పుపై నుంచి పటాకులు పేలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆ కారుల నడిపిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. హెడ్ ​​కానిస్టేబుల్ బల్జీత్ సింగ్ ఇచ్చిన వివరాల మేరకు బుధవారం రాత్రి నుంచి ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. చిన్న క్లిప్‌లో, హెచ్‌ఆర్ 98 ఎ 0108 రిజిస్ట్రేషన్ నంబర్ గల నలుపు రంగు ఎస్‌యూవీ పైకప్పుపై ఉంచిన పటాకులు పేలుతున్నప్పుడు అతడు నిర్లక్ష్యంగా కారు నడపడం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఘటనకు సబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో కదులుతున్న కారు పైకప్పు నుండి పటాకులు పేలుస్తూ కెమెరాలో చిక్కుకున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గురుగ్రామ్‌లోని అత్యంత పాష్ లోకేటీలలో ఒకటైన సైబర్ సిటీ ప్రాంతంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం రాత్రి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తున్న చిన్న క్లిప్‌లో, కారు నడిపిన వ్యక్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. HR 98 A 0108 రిజిస్ట్రేషన్ నంబర్ గల బ్లాక్‌ కలర్‌ SUVని నిర్లక్ష్యంగా నడుపుతూ పైగా పటాకులు కూడా పేల్చారు. కదులుతున్న కారు డోర్, పైకప్పు మీద ఉంచిన పటాకులను గాల్లోకి ఎగురవేస్తున్నాడు. కాగా, సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందింది. అనేక మంది వినియోగదారులు స్పందిస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు సేకరించిన వీడియో ఆధారంగా డీఎల్‌ఎఫ్ ఫేజ్-3 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనలో పాల్గొన్న ముగ్గురినీ అరెస్టు చేశారు” అని ACP ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :