Friday, 18 July 2025 07:19:42 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

రైల్వే స్టేషన్‌లో రైలు ఆపడం మరచిపోయిన లోకో పైలెట్.. ప్రయాణీకులు భయంతో కేకలు

Date : 21 October 2023 08:54 AM Views : 262

జై భీమ్ టీవీ - జాతియం / : దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రైలు ప్రమాదాల కేసుల సంఖ్య ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. బీహార్‌లోని బక్సర్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి రైల్వే సరిగ్గా కోలుకోలేదు. ప్రయాణీకులు ఇంకా తేరుకోలేదు. అయినప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఛప్రాలోని లోకో పైలట్ స్టేషన్‌లో రైలు ఆగకుండా ముందుకు సాగింది. అనంతరం డ్రైవర్ తన తప్పును గుర్తించడంతో రైలుని వంతెన మధ్యలో ఆపాడు. ఆ తర్వాత రైలు దాదాపు 20 నిమిషాల పాటు వంతెనపైనే నిలిచిపోయింది. ఈ సమయంలో రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఏమైయిందో తెలియక అయోమయానికి గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ ప్రయాణం గురించి అయోమయానికి గురయ్యారు. ఛప్రాలోని మాంఝీ హాల్ట్ సమీపంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వాస్తవానికి ఛప్రా బల్లియా రైల్వే సెక్షన్‌లో నడుస్తున్న ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయంత్రం ఛప్రా నుండి ఫరూఖాబాద్‌కు బయలుదేరింది. ఛప్రా తర్వాత దాని మొదటి షెడ్యూల్ స్టాపేజ్‌లో ఆగిన తర్వాత.. అక్కడ నుంచి మాంఝీ హాల్ట్‌కు బయలుదేరింది. రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు మాంఝీ హాల్ట్‌లో కూర్చుని వేచి చూస్తున్నారు. ఆ స్టేషన్ లో దిగాల్సిన వారు తమ సామానుతో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాంఝీ హాల్ట్‌లో రైలు ఆగలేదు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. వంతెనపై ఆగిన రైలు లోకో పైలట్ తన తప్పును గుర్తించడంతో.. అతను సరయూ నదిపై ఉన్న వంతెనపై రైలును ఆపాడు. దాదాపు 20 నిమిషాల పాటు రైలు ఆ వంతెనపై నిలిచిపోయింది. అనంతరం రైలు లోకో పైలట్ రైల్వే అధికారులతో మాట్లాడి రైలును మళ్లీ మాంఝీ హాల్ట్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. రైలు లోకో పైలట్, గార్డు పరస్పరం సమన్వయంతో రైలును మాంఝీకి తిరిగి తీసుకువచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :