Sunday, 14 December 2025 04:43:10 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఢిల్లీ-మీరట్‌ మధ్య పట్టాలెక్కెన నమోభారత్‌ రైళ్లు.. జెండా ఊపి రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Date : 21 October 2023 08:55 AM Views : 393

జై భీమ్ టీవీ - జాతియం / : దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలు (నమో భారత్)ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి దశలో సిద్ధం చేసిన 17 కి.మి కారిడార్ సాహిబాబాద్ నుంచి దుహై వరకు పనిచేస్తుంది. ఇది నమో భారత్‌గా పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి రాపిడ్‌ఎక్స్ రైలు ఇదే. ఘజియాబాద్‌లోని వసుంధర సెక్టార్‌-8లో నిర్మించిన స్టేషన్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో భారత్‌’ను జెండా ఊపి ప్రారంభించారు. శనివారం నుంచి సామాన్య ప్రజల కోసం ర్యాపిడ్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం 12 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ కారిడార్ పొడవు 82 కి.మీ. ఇందులో 14 కి.మీ ఢిల్లీలో మరియు 68 కి.మీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2×2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం 160 కి.మీ. అయినా.. అంతకంటే కొంచెం తక్కువ వేగంతోనే నడపునున్నట్టు అధికారులు వెల్లడించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) NCRలో ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) యొక్క నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది, ఇది ఢిల్లీ మెట్రో యొక్క వివిధ మార్గాలతో అనుసంధానించబడుతుంది. ఇది అల్వార్, పానిపట్ మరియు మీరట్ వంటి నగరాలను ఢిల్లీకి కలుపుతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :