Sunday, 09 November 2025 12:13:51 PM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

పసిడి ప్రయులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందో తెలుసా..?

Date : 29 October 2023 09:49 AM Views : 786

జై భీమ్ టీవీ - జాతియం / : పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే, కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల తగ్గినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 29) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,620 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.74,600 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.57,550 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,770 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,620 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620 లుగా ఉంది. వెండి ధరలు.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,600 ఉండగా.. ముంబైలో రూ.74,600లుగా ఉంది. చెన్నైలో రూ.77,500, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.77,500 ఉంది. కోల్‌కతాలో రూ.74,600, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.77,500 లుగా కొనసాగుతోంది. గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :