Sunday, 07 December 2025 09:47:46 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని తెలుసా? ఎలా తెలుసుకోవాలంటే..

Date : 17 November 2023 12:03 AM Views : 856

జై భీమ్ టీవీ - జాతియం / : కిచెన్‌లో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఎక్స్​పైరీ డేట్​ఉంటుంది. అయితే కొంత మంది వీటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఎక్స్​పైరీ డేట్ చెక్‌ చేసుకుని కొంటుంటారు. మరికొందరేమో చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. అలా వాటిని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూనే ఉంటాము. లేదంటే ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాం. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. వంటగది వస్తువుల్లో గ్యాస్​ సిలిండర్​ ముఖ్యమైనది. అయితే గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని చాలా మందికి తెలియదు. వంటకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్​ సిలిండర్‌కి కూడా ఎక్స్​పైరీ తేదీ అనేది ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియక కొందరు గ్యాస్‌ సిలిండర్‌న్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ పొరబాట్ల వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల గ్యాస్‌ లీకేజీలు, ఒక్కోసారి పేలుళ్లు కూడా సంభవిస్తుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సిలిండర్​ జీవిత కాలం ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని వినియోగించకూడదు. అయితే గ్యాస్‌ సిలిండర్ గడువు తేదీ ఎక్కడ ఉంటుందో, ఎలా తెలుసుకోవాలో తెలియని వారు ఈ కింది సూచనలు ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.. Bus Accident: ఘోర ప్రమాదం.. 300 అడుగుల లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి! సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు, చాలా మంది మొదట సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందో లేదో తనిఖీ చేస్తారు. అలాగే దాని బరువును కూడా తనిఖీ చేస్తారు. కానీ సిలిండర్ గడువు తేదీని ఎప్పుడు అన్నది చెక్‌ చెయ్యరు. సిలిండర్​పైన గడువు తేదీ ఎక్కడ ఉంటుందంటే.. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్‌కు సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు కోడ్‌ రూపంలో A-12, B-23, C-15, D-28 ఇలా అంకెలు వేసి ఉంటాయి. ఈ కోడ్‌ ఎక్స్‌పైరీ సంవత్సరం, నెల వివరాలు సూచిస్తాయి. ఈ కోడ్‌ను డీకోడ్‌ చేయడం కూడా చాలా సులువు. ఎలాగంటే.జ A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గడువు ఉంటుందని అర్ధం B అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు గడువు ఉంటుందని అర్ధం C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు గడువు ఉంటుందని అర్ధం D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు గడువు ఉంటుందని అర్ధం మీరు కొనుగోలు చేసిన సిలిండర్‌పై A-26 అని రాసి ఉంటే.. మీ సిలిండర్ గడువు 2026 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్య ముగుస్తుందని అర్థం. అలాగే D-24 అని వ్రాసినట్లయితే, 2024 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సిలిండర్ గడువు ముగుస్తుందని అర్థం అన్నమాట. ఈ విధంగా మీరు మీ సిలిండర్‌ గడువు తేదీని తెలుసుకోవచ్చు. సాధారణంగా LPG గ్యాస్ సిలిండర్ జీవితకాలం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇలా గడువు తేదీలను చూసి గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :