Friday, 18 July 2025 07:27:05 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

నియంత్రణ కోల్పోయిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్…

Date : 17 November 2023 12:04 AM Views : 595

జై భీమ్ టీవీ - జాతియం / : చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది. చంద్రయాన్-3ని, 2023 జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది. ఐక్యరాజ్యసమితి, ఐఏడీసీ మార్గదర్శకాలను అనుసరించి చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూళ్లు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత దాని అవశేషాలు, ఇంధన వనరులు ప్రమాదవశాత్తు పేలుడుకు గురికాకుండా ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఎగువ దశను నిష్క్రియాత్మకం చేశారు. అంతర్జాతీయంగా ఆమోదించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీని నిష్క్రియం చేయడం.. మిషన్ పూర్తయిన తర్వాత బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్ నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది అని ఇస్రో స్పష్టం చేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :