Sunday, 07 December 2025 09:46:35 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

తెలంగాణ దంగల్‌లోకి పవన్ కళ్యాణ్సొంత పార్టీ నేతల తరపునేనాబీజేపీకి ప్రచారం చేస్తారా

Date : 17 November 2023 09:28 AM Views : 819

జై భీమ్ టీవీ - జాతియం / : తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా- నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో జనసేనపార్టీ, ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ హాట్‌ టాఫిక్‌గా మారారు. తెలంగాణలో పార్టీని అనౌన్స్ చేసిన నాటినుంచి ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేయని జనసేన.. ఈసారి భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 8చోట్ల పోటీ పడుతుంది. అటు జనసేన అభ్యర్థులు సైతం బీజేపీతో కలిసి సమన్వయంతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేశాక.. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్పా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. వారి అభ్యర్థుల తరపున పవన్‌ ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభించలేదు. సమయం దగ్గరపడున్నా పవన్‌ ప్రచారం ఏక్కడ కనిపంచకపోవడంతో.. అసలు ప్రచారంలో పాల్గొంటారా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వాటంన్నిటికి చెక్‌ పెడుతూ పవన్‌ ప్రచారానికి సంబంధించిన డేట్స్‌ ను లీక్ చేశాయి పార్టీ వర్గాలు. జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మంగా అడుగులు వేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు వారి గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకున్నరనే టాక్ వినిపిస్తుంది. జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 8మంది అభ్యర్థుల తరపున నవంబర్ 22న నుంచి సుడిగాలి ప్రచారం చేస్తారని కొంతమంది.. లేదు.. లేదు.. 9,20 తేదీల్లో రెండు రోజుల పాటు పవన్ ప్రచారానికి యాక్షన్ సిద్ధమైందనే టాక్ వినిపిస్తుంది. టోటల్‌గా పవన్ ప్రచారానికి సంబంధించిన డీటెల్స్.. రూట్‌ మ్యాప్‌ ఇవాళ తెలిసే ఛాన్స్ ఉంది. అయితే పవన్‌ కేవలం జనసేన అభ్యర్ధులకే కాదు.. బీజేపీ క్యాండెట్స్ తరపున కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, నడ్డా పర్యటనలు ఖరారు అయ్యాయి. నవంబర్ 18న సకల జనుల సంకల్ప సభల్లో అమిత్‌షా పాల్గొంటారు. గద్వాల, నల్గొండ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిర్వహించే సభల్లో పాల్గొంటారు అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం నవంబర్ 19న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చేవెళ్ల, నారాయణపేట్‌ సభల్లో పాల్గొననున్న నడ్డా.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహిస్తారు నడ్డా. ఇక, తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :