Sunday, 09 November 2025 12:35:51 PM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

భారతదేశంలో రాజకీయ పార్టీలకు గుర్తులు ఎలా కేటాయిస్తారు.. ఎలా మారుతూ వచ్చాయంటే..?

Date : 19 November 2023 09:04 AM Views : 855

జై భీమ్ టీవీ - జాతియం / : రాజకీయ పార్టీ అంటే ముందు గుర్తొచ్చేదీ.. పార్టీల గుర్తులు. పోలింగ్ సమయంలో పార్టీల గుర్తులు ఆధారంగానే ఓటు వేస్తుంటాం. కాంగ్రెస్ అంటే ‘హస్తం’, బీజేపీ అంటే’ కమలం’, బీఆర్ఎస్ అంటే కారు.. ఇలా అందరికీ తెలుసు. ఓటు వేసే సమయంలో పార్టీ అభ్యర్థుల పేరు గుర్తుకు రాకపోయినా, పార్టీ సింబల్ గుర్తుకు వస్తుంటాయి. అతిపెద్ద భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది.?. పార్టీల గుర్తుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం..! కాంగ్రెస్.. కాడేడ్ల నుంచి హస్తం వరకు.. స్వాతంత్ర్య భారత దేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే, రాజకీయ పార్టీల గుర్తుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశంలో 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుర్తు కాడెడ్లు. ఈ గుర్తుతోనే దేశమంతా ఎన్నికల బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇందిరా గాంధీల మధ్య వచ్చిన విభేదాలతో 1978లో పార్టీ చీలిక ఏర్పడింది. ఇందిరా కాంగ్రెస్‌తో ఏర్పడిన కాంగ్రెస్ (ఐ)కి ఎన్నికల సంఘం ఆవు దూడ గుర్తును కేటాయించింది. ఇదే గుర్తుతో 1971 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆవు దూడ గుర్తుపై కూడా బ్రహ్మానంద రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఎన్నికల సంఘం ఆ గుర్తును నిలిపివేసింది. చీలిపోయిన కాంగ్రెస్‌ తిరిగి 1977లో విలీనమై భారత జాతీయ కాంగ్రెస్‌ పేరుతో ఏర్పడడంతో దీనికి హస్తం గుర్తును కేటాయించారు. అప్పటి నుంచి చెయ్యి గుర్తుతో కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలుస్తోంది. పీడీఎఫ్‌కు మొదట హస్తం.. 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం ఉంది. దీంతో పీడీఎఫ్‌ పేరుతో బరిలో నిలిచిన కమ్యూనిస్టులకు.. స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించే హస్తం గుర్తును కేటాయించారు. ఆ తరువాత మారిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడింది. దీంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి కంకి కొడవలి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులను కేటాయించారు. అప్పటి నుంచి సిపిఐ, సిపిఎంలు కంకి కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులతో ప్రతి సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి వెలిగే దీపం నుంచి కమలం వరకు… జన సంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీచే ఢిల్లీలో స్థాపించబడింది. జనసంఘ్ పార్టీ గుర్తు.. వెలిగే దీపం. 1977లో జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనమైంది. ఆ తర్వాత కూడా వెలిగే దీపం గుర్తుపై పోటీ చేస్తూ వచ్చింది.1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జన సంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీకి కమలం గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అప్పటినుంచి నేటి వరకు బీజేపీ అభ్యర్థులు కమలం గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దేశంలో బీజేపీ రెండుసార్లు అధికారాన్ని చేపట్టి, ప్రధాన రాజకీయ పార్టీగా అవతరించింది. కారుతో బీఆర్ఎస్.. తెలంగాణ ఆత్మ గౌరవం నీళ్ళు, నిధులు, నియామకాలు పేరుతో కేసీఆర్ ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను ఏర్పాటు చేశారు. 21 ఏళ్ల క్రితం ఎన్నికల సంఘం టీఆర్ఎస్‌కు కారు గుర్తును కేటాయించింది. అప్పటి నుంచి మొన్నటి వరకు కారు గుర్తు మీదనే టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం కారు గుర్తుని బీఆర్ఎస్ కు కేటాయించింది. 21 ఏళ్ల నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థులు కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :