Saturday, 24 May 2025 01:30:03 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

Date : 24 September 2024 03:22 PM Views : 387

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : KTR | తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్ KTR | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సోద‌రుడు తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సోద‌రుడు తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేశాం. ఏక‌ప‌క్షంగా ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. అందుకే హైద‌రాబాద్‌లో ఉంటున్న పేద ప్ర‌జ‌ల‌పై సీఎం ప‌గ‌బ‌ట్టిండు. హైద‌రాబాద్‌లో ఉండే గ‌రీబోళ్లు.. ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్తీల్లో ఉండే పేదోళ్ల వెంట ప‌డ్డాడు. సీఎంకు చిత్త‌శుద్ధి, నిజాయితీ ఉంటే త‌న అన్న‌తో పాటు పేదోళ్ల‌ను కూడా స‌మానంగా చూడాలి. వాళ్ల అన్న‌కు ఒక న్యాయం ఉంటది.. గ‌ల్లీల ఉండే గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయం ఉంట‌దా..? దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప‌రిధిలో తిరుప‌తి రెడ్డి ఇల్లు ఉంట‌ది. తిరుప‌తి రెడ్డికి నోటీసులు ఇచ్చి.. కోర్టుకు పోయి కాగితం తెచ్చుకో నిన్ను ముట్ట అని చెప్తాడు. అదే గ‌రీబోడి ఇంటికి తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కు బుల్డోజ‌ర్లు వ‌స్తాయి. పుస్త‌కాలు తీసుకుంటాం అంటే ద‌య ఉండ‌దు. బియ్యం తీసుకుంటాం అంటే ద‌య ఉండ‌దు. చెప్పుల దుకాణంతో బ‌తికేవారిని రోడ్డున ప‌డేస్తారు. బిల్డింగ్‌లు నిర్దాక్షిణ్యంగా కూల‌గొడుతారు. తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. పేదోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? కోర్టులు ప‌ని చేయ‌ని శ‌ని, ఆదివారాల్లో వ‌చ్చి కూల‌గొడుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మ‌నం ప‌దేండ్ల‌లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తే.. రేవంత్ రెడ్డి డిస్ట్ర‌క్ష‌న్ చేస్తుండు. ఒక్క శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 12 వేల కోట్ల రూపాయాలు పెట్టి ఫ్లై ఓవ‌ర్లు, లింక్ రోడ్లు, అండ‌ర్ పాస్‌ల‌తో పాటు ఎస్టీపీలు క‌ట్టాం. మ‌నం మంచి ప‌నులు చేసుకుంటూ పోయాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక 9 నెల‌ల కాలంలో ఒక్క మంచి ప‌ని చేయ‌లేదు. రియ‌ల్ ఎస్టేట్ దందా త‌ప్ప ఒక్క‌టి మంచి ప‌ని చేయ‌లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :